Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి మహేష్ బాబు తన నటనతో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.
ఈ విధంగా హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కేవలం సినిమాలు విడుదలైన సమయంలో ఆ సినిమాలు కనుక తనకు నచ్చితే ఆ సినిమాల పైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే మాత్రమే ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలుకి తెలుగులో భారీ స్పందన వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు తెలుగు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారని తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అనంతరం ఈ సినిమా పట్ల మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
యాక్టింగ్ ఇరగదీశారు…
ప్రేమలు సినిమాను తెలుగు ఆడియన్స్‌కి చూపించినందుకు కార్తికేయకి పెద్ద థ్యాంక్స్. ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశా.. అసలు చివరిసారిగా ఓ సినిమా చూసి నవ్వుకొని చాలా రోజులైంది. నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది. యంగ్‌స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. ఈ చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ అంటూ మహేష్ బాబు చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…