Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

దక్షిణాది సినీపరిశ్రమ అనగానే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ లు గుర్తుకువస్తాయి. ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు మద్రాస్ లోని విజయ- వాహిని, జెమినీ స్టూడియోస్ లోనే షూటింగ్ జరుపుకొని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందేవి. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం లాంటి పరిణామాలతో దక్షిణాది రాష్ట్రాలు సొంతగా సినీ పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతిచిన్న రాష్ట్రమైన కేరళ అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలు నిర్మించుకుంటుంది. అయినప్పటికి కొత్త కథలతో సినిమాలు నిర్మించి విజయపరంపర కొనసాగిస్తున్నారు.

Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ 'పసివాడి ప్రాణం' చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!
Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

ఆ క్రమంలో విజయవంతమైన చిత్రాల రీమేక్ హక్కులను టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ కి అమ్ముతున్నారు. 1985 పీటర్ వేర్ దర్శకత్వంలో హారిసన్ ఫోర్డ్ హీరోగా విట్నెస్ (WITNES) చిత్రం విడుదలయింది. కొత్త కథలు కొరకు చూస్తున్నా మలయాళ కథారచయిత ‘ఫాజిల్’ విట్నెస్ చిత్రాన్ని చూసి ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేసి మమ్ముట్టి, నదియా హీరో, హీరోయిన్లుగా “పూవిన్ పుతియా పూన్ తెన్నల్” చిత్రాన్ని రూపొందించారు. మలయాళంలో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలా ఈ విజయవంతమైన సినిమా కోసం ఇతర సినీ పరిశ్రమ నిర్మాతలు పోటీపడి రీమేక్ హుక్కులను కొనుక్కున్నారు. అనేకమంది తెలుగు నిర్మాతలు పోటీపడగా చివరికి రీమేక్ హక్కులు అల్లు అరవింద్ కు దక్కాయి.

Mahesh Babu : మహేష్ బాబు బాలనటుడిగా కృష్ణ ‘పసివాడి ప్రాణం’ చిత్రం ప్రారంభించి.. మధ్యలోనే నిలిపివేశారని మీకు తెలుసా.!!

ఇది గమనించని విజయబాపినీడు ‘విట్నెస్’ అనే ఇంగ్లీష్ ‌చిత్రాన్ని చూసి… ‘సాక్షి’ టైటిల్ తో ఓ కథను రాసుకున్నారు. ఆ కథ హీరో కృష్ణకు నచ్చడంతో.. బాలనటుడిగా మహేష్ బాబుని, హీరోయిన్ గా శ్రీదేవిని అనుకొని అట్లూరి రాధాకృష్ణ నిర్మాణంలో సినిమా ప్రారంభించారు. కానీ గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా ఇదివరకే పసివాడి ప్రాణం చిత్రం ఆరంభమై షూటింగ్ జరుపుకుంటుందని తెలుసుకుని హీరో కృష్ణ సినిమాని మధ్యలోనే నిలిపివేసి కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తీసుకుని ‘మహారాజశ్రీ మాయగాడు’ చిత్రం ప్రారంభించారు. ఇక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం ఘన విజయం సాధించింది.