Ramesh Babu: షాకింగ్.. మహేష్ బాబు సోదరుడు.. రమేష్ బాబు కన్నుమూత.. చివరి చూపులకు మహేష్ వెళ్లేనా..!
Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అకాల మరణం పొందారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రమేష్ బాబు తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ శనివారం సాయంత్రం కన్నుమూశారు.గత కొన్ని రోజుల నుంచి కాలేయ వ్యాధి సమస్యతో బాధ పడుతున్న రమేష్ బాబుకి తీవ్ర అస్వస్థత చేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రకి తరలించారు.
అయితే అప్పటికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం ఏఐజి హాస్పిటల్ లోని మార్చురీలో ఉంది. మరి కాసేపట్లో ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించనున్నారు. రమేష్ బాబు కెరీర్ విషయానికి వస్తే ఈయన బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అదే విధంగా కొన్ని రోజుల విరామంతో ఈయన చదువులు పూర్తి చేసి అనంతరం సామ్రాట్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఇలా రమేష్ బాబు సుమారు 17 చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇలా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ రమేష్ బాబు ఇండస్ట్రీలో కొనసాగలేక పోయారు. ఈ క్రమంలోనే ఈయన 2004వ సంవత్సరంలో నిర్మాతగా మారి కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
చివరి చూపులకు మహేష్ వెళ్లేనా..
మహేష్ బాబు సోదరుడు అకాల మరణం ఘట్టమనేని కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నింపిందని చెప్పాలి. అయితే ఈయన చివరి చూపుల కోసం మహేష్ బాబు వస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుకు కరోనా సోకడంతో వల్ల ఆయన చికిత్స తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సోదరుడు చివరి చూపులకు వస్తారా.. రారా అనేది తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…