Mahesh Babu: సినీ కెరీయర్ లో మొట్టమొదటి సారి స్టేజ్ పై డాన్స్ చేసిన మహేష్ బాబు… వీడియో వైరల్!
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణంగా ఎలాంటి కార్యక్రమాలలోనూ ఫంక్షన్లలోనూ పాల్గొన్నారు. కేవలం ఆయన సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. ఇలా తన సినిమా ఈవెంట్లకు హాజరైనప్పటికీ కేవలం వేదిక పైకి వెళ్లి సినిమా గురించి మాట్లాడటమే తప్ప ఇప్పటి వరకు ఆయన స్టేజ్ పైకి వెళ్లి డాన్సులు వేస్తూ సందడి చేసింది లేదు.
తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ పార్టీలోపాల్గొన్న మహేష్ బాబు ఎవరు ఊహించని విధంగా తన 23 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడు చేయని విధంగా వేదికపై డాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రస్తుతం మహేష్ బాబు డాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ ఒక్కడు సినిమా తరువాత సర్కారీ వారి పాట సినిమా కోసం తిరిగి కర్నూల్ రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నిజానికి ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా కర్నూల్ లోనే ప్లాన్ చేశారు.కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాల్సి వచ్చిందని మహేష్ బాబు వెల్లడించారు.
ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా
‘మైత్రి వారికి’ ’14 రీల్స్’ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత తన కూతురు సితార ఇందులో చాలా బాగున్నావ్ డాడీ అంటూ అని చెప్పినట్లు మహేష్ బాబు వెల్లడించారు.ఇక నాన్న కృష్ణ గారు కూడా దూకుడు, పోకిరి సినిమాకు మించి సర్కారు వారి పాట సినిమా ఉందంటూ ప్రశంసలు కురిపించారని మహేష్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…