Featured

Pranitha baby shower : సీమంతం చేసుకున్న బాపూగారి బొమ్మ.. ఫోటోలు వైరల్..!

Pranitha baby shower : ప్రణీత సుభాష్ అత్తారింటికి దారేదిలో బాపు గారి బొమ్మ పాటతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ కస్తూరి తెలుగు తెరపై ఏమి పిల్లో ఏమి పిల్లడో సినిమాతో పరిచయమైనా, సిద్ధార్థ తో కలిసి బావ సినిమాలో నటించింది. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళంలో కూడా సినిమాలు చేసింది ప్రణీత. ఇక తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించినా అవకాశాలు మాత్రం రాలేదు. సోలో హీరోయిన్ గా తెలుగులో మంచి బ్రేక్ మాత్రం రాలేదు.

ప్రణిత సీమంతం…..

సినిమా అవకాశాలు తగ్గడంతో లాక్ డౌన్ లో అభిమానులకు షాకిస్తూ పెళ్లి చేసుకుంది ప్రణీత. బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఇక ఆ తరువాత సినిమాల్లో కనిపించక పోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేది. తన 34 వ పుట్టినరోజు సందర్బంగా తాను గర్భవతి అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తన భర్తను హగ్ చేసుకుని స్కానింగ్ రిపోర్ట్ ను చూపుతూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక తాజాగా ప్రణీతకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోతోంది ప్రణీత. ఇక ప్రణీత గర్భవతిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఫిట్ నెస్ తో ఉండాలి అనేవి సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago