Mahesh Babu:టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి చెప్పాల్సిన పని లేదు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో మహేష్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాతో బిజీ కానున్నారు.
ఇలా నటన పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు కెరియర్ గురించి ఇప్పటివరకు ఎలాంటి నెగటివ్ మార్క్ కూడా వినిపించలేదు అయితే తాజాగా మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఎలాంటి డైలాగ్స్ అయినా ఎలాంటి సీన్స్ అయినా సింగిల్ టేక్ లోనే పూర్తి చేస్తారు.
ఇలా ఎంత పెద్ద డైలాగ్స్ అయినా ఒకేసారి చెప్పే మహేష్ బాబు ఒక సినిమాలోని చిన్న డైలాగ్ కోసం రెండు గంటల సమయం తీసుకున్నారని తెలుస్తుంది.మరి చిన్న డైలాగ్ కోసం మహేష్ బాబు అంత సమయం తీసుకున్నటువంటి ఆ సినిమా ఏంటి ఆ డైలాగ్ ఏంటి అనే విషయానికి వస్తే… మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తారు. అయితే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం సమయంలో భరత్ అనే నేను అంటూ ప్రమాణస్వీకారం మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే భరత్ అనే నేను అనే డైలాగ్ చెప్పడం కోసం ఈయన రెండు గంటలు కష్టపడ్డారట.ఈ డైలాగ్ చెప్పడానికి వాయిస్ లో చాలా బేస్ ఉండాలన్న ఉద్దేశంతో ఈయన ఈ డైలాగ్ చెప్పడం కోసం ఏకంగా రెండు గంటల పాటు సమయం తీసుకున్నారని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…