Allu Arjun: నేను అందంగా లేనని రిజెక్ట్ చేశారు… నటుడిగా నేను ఫెయిల్ అయ్యాను: అల్లు అర్జున్

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ నేడు నేషనల్ అవార్డు అందుకోవడంతో మెగా అభిమానులతో పాటు అల్లు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నప్పటికీ ఈ అవార్డు వెనుక ఎన్నో అవమానాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని అంతేకాకుండా ఓ భారీ నిర్మాణ సంస్థ తనని రిజెక్ట్ చేశారు అంటూ ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తాను ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాల గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ గంగోత్రి కంటే ముందుగానే తనకు ఓ పెద్ద బ్యానర్ లో అవకాశం వచ్చిందని తెలిపారు.

ఇలా ఆ పెద్ద బ్యానర్ తనకు సినిమా అవకాశం కల్పించి అనంతరం తాను అందంగా లేనని తనని ఆ సినిమా నుంచి రిజెక్ట్ చేశారని అల్లు అర్జున్ తెలిపారు. ఇలా అందంగా లేనని నన్ను రిజెక్ట్ చేయడంతో ఆ సమయంలో చిరంజీవి గారు నాన్న చాలా బాధపడ్డారని అయితే సొంతంగా వాళ్లే తనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అదే సమయంలోనే గంగోత్రి సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు.

Allu Arjun: ఆర్య సినిమా నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు…


ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తన పట్ల చాలా విమర్శలు వచ్చాయి. నటుడిగా అప్పుడు కూడా తాను ఫెయిల్ అయ్యానని తెలిపారు కానీ తనకు మాత్రం నటన వచ్చు అన్న నమ్మకం తనకు ఉండేదని అల్లు అర్జున్ వెల్లడించారు. అదే సమయంలోనే దిల్ రాజు కొత్తవారితో సినిమా చేస్తున్నారని తెలియడంతో ఆర్య సినిమాకు తాను ఎంపిక అయ్యానని అప్పటినుంచి తాను ఇండస్ట్రీలో కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.