Mahesh Babu: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అందం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇలా తెరపై నటీనటులు చాలా అందంగా కనిపించడం కోసం పెద్ద ఎత్తున మేకప్ వేసుకుంటూ ఉంటారు. ఇలా వారు అందంగా కనపడితేనే ప్రేక్షకులు కూడా ఆకర్షితులవుతారు.అయితే కొన్నిసార్లు కథా ప్రాధాన్యతను బట్టి మేకప్ లేకుండా కూడా నటించాల్సి ఉంటుంది.
ఇక పలు సినిమాలలో కొందరు డీ గ్లామర్ పాత్రలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ అందం కూడా పెరుగుతూనే ఉందని చెప్పాలి. ఎంతో అందం సొంతం చేసుకున్నటువంటి మహేష్ బాబు ఓ సినిమాలో మేకప్ లేకుండా నటించారు.
మరి మేకప్ లేకుండా మహేష్ బాబు నటించిన ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..మహేష్ బాబు నటించిన నిజం సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆయన నటనకు మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది. ఇందులో చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ తల్లి మాట వినే కొడుకుగా నటించారు. అయితే ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకప్ వేసుకోలేదట.
ఇందులో నాచురల్ గా కనిపించాలని చెప్పడంతో ఈయన మేకప్ లేకుండా ఈ సినిమాలో నటించారు. మహేష్ బాబు ఎంతో అందగాడు అలాంటి వ్యక్తికి మేకప్ లేకపోయినా అందంగానే కనిపిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…