Featured

Mahesh Babu : నాకు బాగా దగ్గరైన వాళ్ళు దూరమయ్యారు ఎమోషనల్ అయిన మహేష్ బాబు

Mahesh Babu emotional words : పరుశురామ్ దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ రిలీజ్ వేడుకలో హీరో మహేష్ బాబు ఆసక్తికరంగా మాట్లాడారు. అభిమానుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయిన మహేష్ బాబు….

సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు ఇలా మాట్లాడారు…. సర్కారు వారి పాట సినిమా నేను ఒప్పుకున్నాక పరశురామ్ తన ఇంటికి వెళ్లి నాకు ఈ సినిమా ఇరగదీసేస్తాను అని మెసేజ్ చేశారు. ఈ సినిమా నిజంగానే ఇరగదీసినందుకు పరశురామ్‌కి థ్యాంక్స్. మీరు నాన్న అభిమానులకు, నా అభిమానులకు ఫేవరెట్ డైరెక్టర్ అవుతారు. ఇంకా ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య జరిగే సన్నివేశాలు నా ఫేవరెట్ ట్రాక్. దీని కోసం ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టరైజేషన్, నటన రెండు చాలా కొత్తగా ఉంటాయి. గత రెండేళ్లలో ఎన్నిసార్లు షూటింగ్ కోసం డేట్లు అడిగినా తను ఇచ్చింది. తనకు కూడా థ్యాంక్స్. థమన్ నాకు సోదరుడితో సమానం. ఎందుకో తెలీదు కానీ నాకు, థమన్‌కి చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఈ సినిమాతో చాలా హ్యాపీ గా వున్నాను. కళావతి ఎంత హిట్ అయిందో, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. దీని కి సంబందించిన పూర్తి క్రెడిట్ థమన్‌కే చెందుతుంది కాబట్టి థమన్ కి థ్యాంక్స్ చెప్పారు మహేష్.

తరువాత ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు తర్వాత డాన్స్ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ కూ, ఇలా పేరుపేరునా అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందని తెలియజేస్తూ, ఈ రెండేళ్లలో నాకు చాలా దగ్గరైన వ్యక్తులకు దూరమయ్యాను… కానీ మీ అభిమానం మాత్రం తగ్గలేదు అంటూ అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago