Keerthi Suresh speech in SVP pre release event : సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా పరుశురాం దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ తోనే పరశురామ్ ఒక పెద్ద హీరోతో ఒక మాస్, క్లాస్ కాంబినేషన్ సినిమా తాను హ్యాండిల్ చేయగలనని నిరూపించాడు. ఇక ఇందులో మహేష్ కు జోడిగా తొలిసారి కీర్తీ సురేష్ కళావతిగా నటించింది. ఇక ఈ సినిమా మే 12న విడుదలవ్వబోతుంది. ఇక సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జరిగింది.
నన్ను ఆ హీరోయిన్ పేరుతో పిలిచాడు….
ఇక ఈవెంట్ లో కీర్తీ సురేష్ క్యూట్ గా స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ పరుశురామ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది షూటింగ్ అపుడు కీర్తీ సురేష్ ని దర్శకుడు పరశురామ్ రష్మిక అని పిలిచేవారట. పరశురామ్ అంతకుముందు డైరెక్ట్ చేసిన సినిమా గీత గోవిందం సినిమాలో రష్మిక హీరోయిన్ అవ్వడం వల్ల కీర్తీని ఈ సినిమా షూటింగ్ లో రష్మిక అని పొరపాటున పిలిచేవారట ఈ విషయాన్నీ చెబుతూ తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ను కీర్తీ అని పిలుస్తారో లేదో చూడాలి అంటూ కామెడీగా అన్నారు.
టెన్షన్… టెన్షన్….
మహేష్ బాబుతో షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆయన టైమింగ్ ఎలా అందుకోవాలా అని నాకు టెన్షన్. డబ్బింగ్ చెప్పేటప్పుడు తన గ్లామర్ ఎలా అందుకుంటానా అని టెన్షన్. ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు నన్ను మాట్లాడనిస్తారో లేదో టెన్షన్. అయితే అవి నాకు మాత్రమే టెన్షన్స్ అభిమానులకు మాత్రం సెలబ్రేషన్స్ అంటూ క్యూట్ గా చెప్పేసింది కళావతి. మహేష్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మైత్రి మూవీ మేకర్స్ వారికి ధన్యవాదములు ఇంతకు ముందే మైత్రి వారితో పనిచేయాల్సి ఉన్నా కుదరలేదు ఇపుడు మహేష్ గారి కాంబినేషన్ లో చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఇక కళావతిగా ఒక గుర్తుండిపోయే పాత్ర ఇచ్చినందుకు పరశురామ్ గారికి థాంక్యూ చెప్పింది. ఇక మహేష్ గారి రియల్ కళావతి నమ్రత గారూ నన్ను ఎంతో సపోర్ట్ చేసారు అందుకు ధన్యవాదాలు అంటూ స్పీచ్ తో మహేష్ అభిమానులను ఆకట్టుకుంది కీర్తీ.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…