Categories: FeaturedMovie News

Mahesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్… అభిమాని పిల్లలకు అండగా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన మరోవైపు ఎన్నో రకాల వ్యాపారాలను కూడా చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారు. ఇక మహేష్ బాబు సంపాదనలో కొంత భాగం పేద ప్రజల కోసం ఖర్చు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే మహేష్ బాబు తన తండ్రి సొంత ఊరు అయిన బుర్రెపాలెం దత్తత తీసుకొని ఆ గ్రామంలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసే పునర్జన్మ కల్పిస్తున్నారు.

ఇలా ఇప్పటికే మహేష్ బాబు తన పౌండేషన్ ద్వారా ఎంతో మందికి అండగా నిలిచి తన మంచి మనసు చాటుకున్నారు. అయితే తాజాగా తన వీరాభిమాని పిల్లలకు కూడా అండగా నిలిచి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. మోపిదేవి పెదప్రోలులో కాకర్లపూడి రాజేష్ అని వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఈయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి మహేష్ బాబు సినిమా పేర్లు అయిన అర్జున్, అతిథి, ఆగడు అనే పేర్లు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు.

మహేష్ సినిమా పేర్లే..
ఇకపోతే రాజేష్ ఇటీవల కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. దీనికి తన పిల్లలు చదువుకోలేక ఇతర పనులకు వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మహేష్ బాబు అభిమానులు ఆయన దృష్టికి తీసుకు వెళ్లడంతో మహేష్ బాబు ఫౌండేషన్ టీం రాజేష్ ఇంటికి చేరుకొని ఆ పిల్లల చదువు బాధ్యతలను తీసుకొని వారిని చదివిస్తున్నారు. ఈ విషయం తెలిసి మహేష్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago