Movie News

Mahesh Babu: మీరు గర్వపడేలా చేస్తా నాన్న.. తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మహేష్ బాబు!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తల్లిదండ్రుని కోల్పోయి ఎంతో బాధలో ఉన్నారు. తల్లి మరణించిన కొన్ని రోజులకే తండ్రి కూడా మరణించడంతో మహేష్ బాధ వర్ణాతీతం అని చెప్పాలి. ఇలా మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించి పది రోజులు కావస్తుంది ఇప్పటికే మహేష్ కుటుంబ సభ్యులు తన తండ్రి మరణం నుంచి కోలుకోలేకపోతున్నారు.

మహేష్ బాబు కొడుకుగా తండ్రి కృష్ణ గారి అంత్యక్రియలతో పాటు ఆయనకు చేయాల్సిన కార్యక్రమాలన్నింటిని కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు తన సినిమా షూటింగుకు విరామం ప్రకటించి తన తండ్రి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తున్నారు. ఇకపోతే కృష్ణ గారు మరణించిన పది రోజులకు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఈ క్రమంలోనే మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ మొదటిసారి తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రి ఫోటోని షేర్ చేస్తూ మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ధైర్యంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం.

Mahesh Babu: వారసత్వాన్ని కొనసాగిస్తా…

ఈ విధంగా మీ నుంచి నాకు స్ఫూర్తి కలిగిన విషయాలన్నీ కూడా మీతోనే వెళ్లిపోయాయి. ఇకపై నాలో ఎలాంటి భయం ఉండదు. ముందు కన్నా ఇప్పుడు నాలో మరింత బలం చేరింది. మీ కాంతి ఎల్లప్పుడు నాలో ప్రసరిస్తుంటుంది…మీ వారసత్వాన్ని ఇలాగే కొనసాగిస్తూ మీరు మరింత గర్వపడేలా చేస్తా నాన్న.. ఐ మిస్ యు.. ఐ లవ్ యు సో మచ్ అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago