Kalpika Ganesh: కల్పిక గణేష్ యశోద సినిమా విడుదల అనంతరం ఈమె పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మార్మోగిపోతుంది. ఈమె ఇదివరకు పలు సినిమాలలో సిస్టర్ రోల్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే యశోద సినిమా తర్వాత ఈమెకు మరింత పాపులారిటీ రావడంతో ప్రస్తుతం ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం సమంత లాగే తనకి మయోసైటిసిస్ వ్యాధి ఉందని తాను ఫస్ట్ స్టేజ్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.ఇకపోతే తాజాగా ఈమె మరోసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కల్పిక సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు సుమారు 30 సినిమాలలో నటించానని తెలిపారు.
ఈ విధంగా తను 30 సినిమాలలో నటించిన కొన్ని సినిమాలలో తాను నటించిన తర్వాత తన పాత్రను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు ఈమె వెల్లడించారు.ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం గురించి తాను ఆరా తీయగా కొందరు దర్శకులు హీరోయిన్ కన్నా మీరే అందంగా కనిపిస్తున్నారు అంటూ సమాధానం చెప్పారని కల్పిక వెల్లడించారు.
హీరోయిన్లను డామినేట్ చేసే విధంగా నా పాత్ర ఉండడంతో నన్ను పక్కన పెట్టారని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ, కథ నచ్చితేనే సినిమాలలో నటిస్తానంటూ ఈమె చెప్పడంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలను నెగిటివ్ గా తీసుకొని తనపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…