Featured

Mahesh Babu: యశోద హాస్పిటల్ ముందు మహేష్ కేరవాన్… ఏమైందంటూ ఆందోళనలో అభిమానులు!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకోగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రెండవ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా కొన్ని హాస్పిటల్స్ సన్ని వేషాలను కూడా చిత్రీకరించాల్సి ఉండగా చిత్ర బృందం ఈ సన్నివేశాలను హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ లో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ షూటింగ్లో మహేష్ బాబు పూజా హెగ్డే పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా హాస్పిటల్లో షూటింగ్ చిత్రీకరించాల్సిన నేపథ్యంలో మహేష్ బాబు క్యారవాన్ యశోద హాస్పిటల్ ముందు కనిపించింది. దీంతో అభిమానులు కొంతపాటి ఆందోళనకు గురైనప్పటికీ తర్వాత అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమాలో మరోసారి హాస్పిటల్ సన్నివేశాలను పెట్టడంతో ఈయన గత సినిమా సన్నివేశాలనే పునరావృతం చేస్తున్నారు అంటూ నేటిజెన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


Mahesh Babu:శరవేగంగా SSMB 28 చిత్రీకరణ…

ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో దాదాపు 11 సంవత్సరాలు తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా మంచి విజయాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీల కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago