Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్ లో ఉండబోతున్నారని తాజాగా విడుదల చేసిన గ్లింప్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా గంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన తదుపరిచిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నట్లు మనకు తెలిసిందే ఇక రాజమౌళి సినిమా అంటేనే ఆయన సినిమా విషయంలో చాలా స్టిక్ గా ఉంటారన్న సంగతి మనకు తెలుసు.రాజమౌళి సినిమా నుంచి ఏదైనా పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ కానీ ప్రకటించే వరకు ఆ హీరో లుక్ బయటకు లీక్ అవ్వకుండా చూసుకుంటారు.
ఇలా రాజమౌళితో సినిమా అంటే హీరోలకు ఇతర సినిమాలలో నటించే అవకాశం అస్సలు ఇవ్వరు కనుక మహేష్ బాబు కూడా పూర్తిగా రెండు మూడు సంవత్సరాలు పాటు రాజమౌళి సినిమాకు మాత్రమే పరిమితం కావలసి ఉంటుందని తెలుస్తుంది.ఇలా రాజమౌళి సినిమాతో రెండు మూడేళ్లు బిజీగా ఉండే మహేష్ ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సిందేనని అందుకే ఈయన కొన్ని రోజులపాటు తన ఇతర సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.
రాజమౌళి సినిమా అంటే హీరోలకు శిక్షణ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అదొక ఆర్మీ క్యాంపు లాగా హీరోలు భావిస్తుంటారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా పూర్తిగా తన మేకోవర్ మార్చుకోవాల్సి ఉంటుందని,తన సినిమాకు భారీగా కష్టపడాలని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత మహేష్ బాబు ఇతర సినిమాలు చేయకూడదని ఫిక్స్ అవుతూ ఇతర సినిమాలకు బ్రేక్ ఇచ్చారని సమాచారం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…