Rashmika: కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి రష్మిక మందన్న.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కేవలం కన్నడ భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలు అందుకొని వరుస సినిమాలతో అన్ని భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రష్మిక వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా జీవితానికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలను తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం రష్మిక మందన్న జీవిత సత్యాలను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది ఇందులో భాగంగా ఈమె తన ఫోటో ఒకదాన్ని షేర్ చేసి కోలుకో, నేర్చుకో, ఎదుగు, ప్రేమించు అంటూ నాలుగు పదాలు షేర్ చేసింది. ఆమె చెప్పింది ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. గతంలోని నిరాశలను వదిలి ముందుకు వెళ్లాలని, జీవితంలో ఎదురైన ప్రతి విషయం నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకోవాలని, ఆ తర్వాత మంచి వ్యక్తులుగా ఎలా తయారవ్వాలో నేర్చుకోవాలని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఫోటో షేర్ చేస్తున్న సమయంలో ఆమె చాలా ట్రెడిషనల్ గా కనపడుతూ చేతిలో ఒక ఆకుని కంటికి అడ్డం పెట్టుకొని షేర్ చేసింది. దీంతో రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. నిహారిక సినిమాల విషయానికి వస్తే ఈమె పుష్ప 2 సినిమాతో పాటు రెయిన్ బో, యానిమల్ సినిమాలతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ తో కలిసి మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో రష్మిక ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…