Mahesh Babu: ఆ స్టార్ డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..! ఎందుకో తెలుసా..?
Mahesh Babu: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న.. ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటికే మోహన్ బాబు, బన్నీ, రాజమౌళి, శ్రీకాంత్, బోయపాటి మొదలైన వారితో టాక్ షోని నిర్వహించారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది.
తాజాగా గ్రాండ్ ఫినాలే జరుపుకుంటోంది. ఈ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఆయన తన కెరీర్, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ షోకు మహేష్ బాబుతో పాటు దర్శకుడు వంశీ పైడపల్లి కూడా హాజరయ్యారు.
ఇలా షో జరుగున్న సమయంలో బాలయ్య.. డైరెక్టర్ మెహర్ రమేష్ కు ఫోన్ చేశారు. ఓసారి ముంబైలో ఎదురైన సంఘటన గురించి తెలిపారు. ఓ సారి ముంబై మారిటన్ హోటల్‌లో మేము టిఫిన్ చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్పీ అడిగారు ఆ తర్వాత ఏం జరిగిందో మహేశ్ చెప్తాడు అని ఫోన్ పెట్టాశాడు.
ఈ విషయంపై మహేష్ ఓపెన్ అయ్యారు. ఓసారి ముంబై మారిటన్ హెటల్ లో టిఫిన్ చేస్తుండగా.. ఇద్దరు అమ్మాయిలు వచ్చి తనను సెల్ఫీ అడిగారని.. అయితే తాను ఫ్యామిలీతో ఉన్నానని వారిద్దరికి చెప్పడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారన్నారు. ఇది చూసిన మెహర్ రమేష్ వారు ఇద్దరు డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లి.. సారి సార్ మీ కూతుళ్లు అని తెలియదని చెప్పానని.. దానికి శంకర్ పర్వాలేదు, హీరోలు ఎలా ఉంటారో కూడా వీరికి తెలియాలి కదా అని అన్నారని గుర్తు చేసుకున్నారు
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…