Akkineni Hero: బ్రేకప్ అయితే మనిషి బెటర్ అవుతాడు.. అక్కినేని హీరో కామెంట్స్ వైరల్!
Sushanth: టాలీవుడ్, హాలీవుడ్ , బాలీవుడ్ అనే తేడా లేకుండా.. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విడిపోతున్న వార్తలు మనం వింటూనే ఉన్నాడు. టాలీవుడ్ లో ఎంతో రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన ఒక్కసారిగా అటు అభిమానులతో పాటు.. సినీ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చింది.
వీళ్ల కంటే ముందు కూడా ఎంతో మంది జంటలు విడిపోడం గమనార్హం. ప్రస్తుతం ఇటీవల జేడీ చక్రవర్తి దంపతులు కూడా విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. కొంతమంది అయితే పెళ్లి చేసుకోవడానికి ముందే ప్రేమలో ఉంటూ.. చిన్న చిన్న మనస్పర్థలతో విడిపోతుంటారు. ఇలా అన్యోన్యంగా ఉండాల్సిన జంటలు ఎన్నో విడిపోయాయి కూడా.
ఇదంతా ఇలా ఉంటే.. సెలబ్రిటీల విడాకులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక దీనిలో కొంతమంది అబ్బాయిలది తప్పు ఉందని అంటుంటే.. మరికొంతమంది అమ్మాయిలది తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే సుమంత్ హీరోగా తెరకెక్కిన ‘‘మళ్లీ మొదలైంది’’ మూవీ ఈ నెల 11వ తేదీన ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా అంతా డైవర్స్ తీసుకున్న దంపతుల గురించి చెప్పే చిత్రం. వాళ్లు ఎందుకు విడిపోతున్నారు.. విడిపోయిన తర్వాత ఎవరిపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.. సమాజం వాళ్ల గురించి ఏమనుకుంటుంది అనే విషయాలను చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనిలో సుశాంత్ , నిఖిల్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రేకప్ గురించి తన అభిప్రాయం అడుగుతున్నారని.. మొన్నే నాకు పెళ్లి అయిందని అప్పుడే బ్రేకప్ అంటే కష్టం అంటూ కామెంట్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం తన వైవాహిక జీవితం బాగుందని చెప్పాడు. దీనిపై సుశాంత్ మాట్లాడుతూ.. బ్రేకప్స్ గురించి మాట్లాడేంత అర్హత తనకు లేదని.. ఎందుకంటే..తనకు పెళ్లి కాలేదని.. కాలేజ్ సమయం నుంచి బ్రేకప్స్ అనేవి ఉంటాయని అది సహజం అని చెప్పాడు. ఇక బ్రేకప్ లాంటివి జరిగితే మనిషి బెటర్ అవుతాడని కామెంట్ చేశాడు. ఇక తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయన్నాడు. ప్రస్తుతం నిఖిల్, సుశాంత్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…