Mahesh -Namratha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు నటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు.
ఇక మహేష్ బాబు హీరోయిన్ నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి కేవలం ఇంటికి పరిమితమై మహేష్ బాబు సినిమా పనులతో పాటు ఆయన వ్యాపారాలను కూడా చూసుకుంటోంది.
వీరిద్దరూ జోడీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు నమ్రత ఇద్దరు కలిసి కుటుంబ సభ్యుల వివాహానికి హాజరు అయ్యారు. ఈ వివాహ వేడుకలో మహేష్ నమ్రతా జంట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. హైదరాబాదులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు హాజరైన మహేష్ నమ్రత దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం ఈ వివాహ వేడుకలో నమ్రత మహేష్ బాబుకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్ బాబు తెల్ల చొక్కా ధరించి ఎంతో సింపుల్ గా కనిపించగా నమ్రత కూడా ఎరుపు రంగు దుస్తులలో చాలా అందంగా కనిపించింది. చూడ చక్కనైన ఈ జంట వివాహ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాతో బిజీ కారు ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…