Making of RRR : ఆర్ఆర్ఆర్…సినిమా ప్రపంచం అంతటా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సినిమా పూర్తి చేయడానికి సంవత్సరాల సమయం తీసుకున్నప్పటికి ఆది రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అని తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాను థియేటర్ లో చూసిన ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. అంతలా సినిమాలో విజువల్స్ వున్నాయి. రాజమౌళి సినిమాలలో విజువల్స్ ఎంత గొప్పగా చూపిస్తారో .. తెరవెనుక విఎఫ్ఎక్స్ పని తనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సన్నివేశాలు , ఇంటర్వెల్ ఫైట్, ఫారెస్ట్ లో క్లైమాక్స్ సీన్ ఇవన్నీ థియేటర్లలో ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన విఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
అసలు బైక్ లేకపోయినా మాయ చేసిన జక్కన్న…
ఇటీవల విడుదల అయిన కొమురం భీముడో పాటకు సంబందించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఇపుడు ఎన్టీఆర్ క్లైమాక్స్ ఫైట్ లో బైక్ సీన్ కు సంబందించిన వీడియో విడుదల చేశారు. ఈ సీన్లో ఎన్టీఆర్ వాటర్ లో నుండి బయటికి వచ్చి తెల్లవాళ్లపై విరుచుకు పడతాడు. ఆ క్రమంలోనే బైక్ ని కాలుతో తన్ని గాల్లోకి లేపుతాడు. అయితే అసలు ఈ సీన్ లో ఎన్టీఆర్ బైక్ ని టచ్ చేయకపోగా.. బైక్ పై ఎక్కి వెళ్లడం అనేది చూపించడం గమనార్హం. ఈ ఫైట్ సీన్ చూస్తే ఖచ్చితంగా అందరు ముక్కున వేలు వేసుకుంటారు.
థియేటర్ లో అభిమానులకు పునకాలు తెప్పుంచిన ఈ సీన్…రియల్ గా షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్ లోనే జరిగింది. అయితే ఈ సీన్ కు విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ అయ్యేసరికి సీన్స్ అన్ని ఓ రేంజ్ లో వచ్చాయి . ఈ ఘనత అంత సినిమాకు ప్రొడక్షన్ డిజైన్ చేసిన సాబు సిరిల్ , సినిమాటోగ్రఫీ అందించిన కేకే సెంథిల్ కుమార్ కి దక్కుతుంది . ఇప్పుడు వైరల్ అవుతున్న బైక్ సీన్ మేకింగ్ వీడియో చూస్తూన్న నెటిజన్స్ మాత్రం అక్కడ అసలు బైక్ లేదు కదండీ! అన్న కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…