Movie News

కరోనా తో ప్రముఖ నటి మాలాశ్రీ భర్త మృతి..!!

ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బతో సినీ ఇండస్ట్రీ కుదేలయింది.. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ కరోనా తాకిడికి బలైపోయారు..ఇక తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో హీరోయిన్‌గా నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీ భర్త ప్రముఖ నిర్మాత రాము(52) కరోనాతో కన్నుమూసారు. ఈయన కన్నడలో పలు భారీ చిత్రాలను నిర్మించారు.

ఈయనకు వారం క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఈయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఈయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సాయంత్రం కన్నుమూసారు.ఈయన కర్ణాటకలోని తుముకూరు జిల్లాకు చెందిన వారు. కన్నడ చిత్ర సీమలో పలు భారీ చిత్రాలను ముఖ్యంగా తన భార్య మాలాశ్రీతో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.

కన్నడలో ఈయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. దాదాపు 40 చిత్రాల వరకు నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరు ఉండటంతో ఈయనను అందరు కోటి రాముగా పిలుస్తారు. ఈయన సాయి కుమార్‌ హీరోగా ఏకే 47, లాకప్ డెత్, కలాసి పాళ్య లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలను నిర్మించారు. ఈయన హీరోయిన్ మాలాశ్రీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఈయన అకాల మరణంతో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై కన్నడతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈయన అంత్యక్రియలు బెంగుళూరులో ఈ రోజు జరగనున్నాయి.2020 లాగా 2021 చిత్ర సీమకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ యేడాది ఇప్పటికే నటుడు వివేక్, పొట్టి వీరయ్య వంటి ప్రముఖ నటులు కన్నుముసారు..అది జరిగి మరువక ముందే ఇప్పుడు మరో విషాదం జరగడం బాధాకరమైన విషయమనే చెప్పాలి…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago