టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల నితిన్ సరసన చెక్ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ చేసిన విషయం తెలిసిందే..ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది..ఇదిలా ఉంటె ఈ అమ్మడు కొత్తగా ఒప్పుకున్న సినిమా ఒకటి అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా ఆమె కనిపించబోతుంది. కార్పొరేట్ కంపెనీల్లో ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంటుంది.
మరి కండోమ్ కంపెనీల్లో పనిచేసే లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో మరి. అసలు వాళ్ళను ‘సెక్స్’క్యూటివ్ అని సరదాగా అనుకోవచ్చు ఏమో..ఇంతకీ రకుల్ పని ఏమిటంటే.. కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్ అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పని అన్నమాట. అసలు ఇలాంటి పనిని అమ్మాయిలు చేస్తారా? అంటే.. సినిమా కాబట్టి ఏమైనా చేస్తారు.
సో.. రకుల్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎలాగూ కామెడీ సినిమా కాబట్టి మసాలా అంశాలు మస్తుగా దట్టిస్తారు. పైగా ఆ టైపు క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది.ఇంతకీ ఈ ఆణిముత్యాన్ని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రకుల్ ఒప్పుకోవడానికి ఒక కారణం ఉంది. హిందీలో వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరో. కాబట్టే.. రకుల్ కండోమ్ కంపెనీ ‘సెక్స్’క్యూటివ్ నటించడానికి వెంటనే ఒప్పేసుకుంది.
ఏది ఏమైనా రకుల్ పక్కా బిజినెస్ విమెన్.హీరోలను పట్టుకోవడంలో రకుల్ మాస్టర్ డిగ్రీ చేసింది. ఏది ఏమైనా పెద్దగా అందం అభినయం లేకపోయినా.. విపరీతమైన బోల్డ్ నెస్ తో ఎప్పటికప్పుడు మంచి కిక్ ఇస్తూ మొత్తానికి ఆ రకంగా రకుల్ ముందుకు పోతుంది. ఇక బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని, ఎప్పటినుండో తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి ఒక స్టార్ హీరో ఆమెకు వరుసగా ఆఫర్లు కూడా ఇప్పించాడు. అయినా రకుల్ అక్కడ బి గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది…!!
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…