బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో వంటలక్క సవతితల్లి పాత్రలో పోషిస్తున్న భాగ్యం అలియాస్ ఉమాదేవి చేసే కామెడీ అందరి చేత నవ్వులు పూయిస్తుంది. కార్తీకదీపం సీరియల్ బోర్ కొడుతునప్పుడు భాగ్యం పాత్ర ఎంటర్ అయితే చాలు అందరి మొహాల్లో నవ్వులు పూస్తాయి.
ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించిన ఉమాదేవి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సీరియల్స్ లో ఎంతో బిజీగా ఉండటంవల్ల సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేశారు. ఎంతో మంది స్టార్ కమెడియన్ సరసన నటించిన ఉమాదేవి బోల్డ్ పాత్రలలో కూడా నటించి సందడి చేశారు.అయితే తాను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్ళు పూర్తికావడంతో ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలను గురించి ఉమా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకోవడం తన కల అని ఆమె తెలిపారు. అటు బుల్లితెర లోను, వెండితెరలోను నటించిన ఈమె దేనిలో నటించడం కష్టమని అడిగితే.. మనకి ఇష్టమైన పని చేయడం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు ఇష్టంగా చేస్తే ఏది కష్టమనిపించదు అంటూ నటన పై తనకున్న ఇష్టాన్ని తెలియజేశారు.
ఇన్ని సంవత్సరాల తన కెరియర్లో ఎప్పుడూ కూడా ఇబ్బంది పడింది లేదని, ఇన్నేళ్లు తాను చేసిన పాత్రలో ఇది చేయకపోయి ఉంటే బాగుండేది అనే పాత్రలు ఒక్కటి కూడా లేదని ఆమె తెలిపారు. ఏదైనా మనం ఒక ప్రొఫెషనల్ అనుకున్నప్పుడు అది ఇష్టంగానే నటించాలి. కష్టం అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చోవడం ఎంతో ఉత్తమం అంటూ తెలిపారు.కేవలం సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా అది ఏ ఇండస్ట్రీలో అయినా ఇష్టంతో చేస్తే అందులో ఉన్న కష్టం విలువ మనకు తెలియదు అంటూ ఉమా తెలిపారు. ఇన్ని సంవత్సరాల తన కెరియర్లో ఎప్పుడూ ఎవరి వల్ల ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదని, ఇప్పటికీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉండటంవల్ల తన కెరీర్ ని ఇలా కొనసాగిస్తున్నానని ఆమె తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…