విమానం ఎక్కాలనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఫ్రీగా విమానంలో పోవచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఆశ కలుగుతుంది. అయితే ప్రస్తుతం విస్తారా ఎయిర్లైన్స్ వారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేమిటంటే ఉచితంగా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే ఈ ఆఫర్ ప్రతి ఒక్కరికి కాదండోయ్.. కేవలం డాక్టర్లు, నర్సులకు మాత్రమే ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ను కల్పించింది.
ఈ నేపథ్యంలోనే ఆదివారం విస్తారా ఎయిర్లైన్స్ ఈ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా ప్రభుత్వ సంస్థలలో పనిచేసే డాక్టర్లు నర్సులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకే విస్తారా ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి ఉత్తరం రాసింది. ఈ విమాన సేవల ద్వారా ప్రభుత్వ సంస్థలకు, హాస్పిటల్స్ కు తక్షణ సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే వారికి ముందు సీట్లు కేటాయింపు ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులలో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందించాల్సిన విషయం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…