Malavika Sreenath: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే విషయం మనకు తెలిసింది. అయితే ప్రతి ఒక్క రంగంలోనూ మహిళలు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కానీ సినిమా రంగంలో ఇది కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ బహిరంగంగా ఈ విషయాల గురించి మాట్లాడారు.
తాజాగా మరొక నటి సైతం తాను కూడా క్యాస్టింగ్ బాధితురాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మాళవిక శ్రీనాథ్ తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. దాదాపు మూడు సంవత్సరాల క్రితం మంజు వారియర్ కూతురి పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతుండగా తాను కూడా వెళ్లానని తెలిపారు. సినిమా వాళ్ళే తనకు కారు పంపించడంతో తాను అక్క తన తల్లి కలిసి ఆడిషన్స్ కోసం వెళ్ళాము.
ఓ బిల్డింగ్ లో ఆడిషన్స్ జరుగుతుండగా అక్కడికి వెళ్లి బయట కూర్చున్నాము అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి మీ జుట్టు సరిగా లేదు పక్కన రూమ్ లోకి వెళ్లి సరి చేసుకోండి అని చెప్పారు. దాంతో నేను గదిలోకి వెళ్ళగా నా వెనకే అతను వచ్చి నన్ను చాలా అసభ్యంగా తడమడం మొదలుపెట్టాడు. బయట మా అమ్మ అక్క ఉన్నారన్న భయం కూడా లేకుండా ఆయన లోపలికి వచ్చే పది నిమిషాలు కాంప్రమైజ్ అయితే ఆ పాత్ర నీకే వస్తుందని చెప్పారు.
ఇక తాను అతని చెర నుంచి ఎలాగో తప్పించుకొని బయటకు వచ్చానని ఈ సందర్భంగా మాళవిక శ్రీనాథ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 2021లో వచ్చిన మధురం సినిమాతో వెండితెరపైకి అడుగుపెట్టారు. ప్రసుత్తం వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీ గడుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…