Categories: FeaturedMovie News

కన్న కొడుకుపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన నటి !!

సాధారణంగా తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలు తప్పు చేస్తే వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే… తమ బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసిన పేరు బయటకు రాకుండా మేనేజ్ చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ మళయాళ నటి స్వయంగా తన కొడుకుపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మలయాళీ నటి మాల పార్వతీ, ట్రాన్స్‌జెండర్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కన్న కొడుకైన అనంత్‌ కృష్ణన్‌పై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో మాల పార్వతీ తన కొడుకుపై కామెంట్స్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. వివరాల్లోకి వెళ్తే.. 2017 నుంచి మాల కుమారుడు అనంత్‌ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని , అసభ్యకరమైన ఫొటోలు పంపిస్తున్నాడని సీమా వినీత్‌ సోషల్‌ మీడియాలో వివరించారు. సీమా కామెంట్స్ చూసిన మాల వెంటనే సీమాకు ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పి, ఆ తర్వాత ఆమె తన కొడుకుపైన పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాల పార్వతీ మాట్లాడుతూ.. నిజంగా తన కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ‘ మేకప్‌ ఆర్టిస్ట్‌ సీమా వినీత్‌తో తనకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉందని, తన కొడుకు అనంత్‌ తనతో చెప్పాడని‌, సీమ అంగీకారం లేకుండా ఆమెతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదన్నాడని. కేసు పెట్టి విచారణ చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని మాల తెలిపారు. ఇప్పటికే కేసు పెట్టి.. అనంత్‌ సెల్‌ఫోన్‌ని పోలీసులకు అప్పగించానని.. తన సపోర్ట్ మాత్రం సీమకే అని తెలిపారు మాల. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ విషయంలో తన కొడుకు అనంత్‌ను తప్పుగా చూడటం లేదని, ఒకవేళ తన కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని మాల స్పష్టం చేయడం విశేషం.

సీమా కేవలం డబ్బు కోసమే మాల కొడుకుపై ఆరోపణలు చేస్తోందా.. లేక నిజంగానే అనంత్ అలా ప్రవర్తించాడా.? అన్నది పోలీసులే తేల్చాలి. ఏదేమైనా తప్పు చేసిన కన్న కొడుకుపైనే కంప్లైంట్ ఇచ్చిన మాల పార్వతికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago