సాధారణంగా తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలు తప్పు చేస్తే వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక సెలబ్రిటీలు అయితే… తమ బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసిన పేరు బయటకు రాకుండా మేనేజ్ చేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా ఓ మళయాళ నటి స్వయంగా తన కొడుకుపైనే లైంగిక వేధింపుల కేసు పెట్టింది. మలయాళీ నటి మాల పార్వతీ, ట్రాన్స్‌జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కన్న కొడుకైన అనంత్ కృష్ణన్‌పై ఆమె పోలీసులకు కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో మాల పార్వతీ తన కొడుకుపై కామెంట్స్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. వివరాల్లోకి వెళ్తే.. 2017 నుంచి మాల కుమారుడు అనంత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని , అసభ్యకరమైన ఫొటోలు పంపిస్తున్నాడని సీమా వినీత్ సోషల్ మీడియాలో వివరించారు. సీమా కామెంట్స్ చూసిన మాల వెంటనే సీమాకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పి, ఆ తర్వాత ఆమె తన కొడుకుపైన పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాల పార్వతీ మాట్లాడుతూ.. నిజంగా తన కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ‘ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్‌తో తనకు చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉందని, తన కొడుకు అనంత్ తనతో చెప్పాడని, సీమ అంగీకారం లేకుండా ఆమెతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదన్నాడని. కేసు పెట్టి విచారణ చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని మాల తెలిపారు. ఇప్పటికే కేసు పెట్టి.. అనంత్ సెల్‌ఫోన్‌ని పోలీసులకు అప్పగించానని.. తన సపోర్ట్ మాత్రం సీమకే అని తెలిపారు మాల. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ విషయంలో తన కొడుకు అనంత్‌ను తప్పుగా చూడటం లేదని, ఒకవేళ తన కొడుకు తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే’ అని మాల స్పష్టం చేయడం విశేషం.

సీమా కేవలం డబ్బు కోసమే మాల కొడుకుపై ఆరోపణలు చేస్తోందా.. లేక నిజంగానే అనంత్ అలా ప్రవర్తించాడా.? అన్నది పోలీసులే తేల్చాలి. ఏదేమైనా తప్పు చేసిన కన్న కొడుకుపైనే కంప్లైంట్ ఇచ్చిన మాల పార్వతికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.!



























