Mamatha Mohandas: మమతా మోహన్ దాస్ పరిచయం అవసరం లేని పేరు.కెరియర్ మొదట్లో సింగర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం ఈమెలో హీరోయిన్ యాంగిల్ కూడా ఉందని గుర్తించిన జక్కన్న యమదొంగ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం కల్పించారు. ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం తెలుగులో కృష్ణార్జున’ ‘విక్టరీ’ ‘హోమం’ ‘చింతకాయల రవి’ ‘కింగ్’ ‘కేడి’ వంటి క్రేజీ సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇక నాగార్జున నటించిన కింగ్ సినిమా విషయంలో తనకు పెద్ద ఎత్తున మోసం జరిగిందని శీను వైట్ల షూటింగుకు ముందు ఒక కథ షూటింగ్ తర్వాత తన పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉందని ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ సినిమా సమయంలో నాగార్జున తనకు మరో సినిమాలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఆయన నటించిన కేడి సినిమాలో ఫుల్ లెన్త్ హీరోయిన్ అవకాశాన్ని కల్పించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయానికి తాను క్యాన్సర్ బారిన పడ్డానని తెలిపారు. ఇలా తనకు క్యాన్సర్ అని నాగార్జున గారికి చెప్పడంతో పర్వాలేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటూనే సినిమాలలో నటించు అని చెప్పారు. లేదు నాకు జుట్టు కూడా మొత్తం ఊడిపోతుంది సార్ అని చెప్పినప్పటికీ ఆయన అది పెద్ద సమస్య కాదు అంటూ ఇచ్చిన మాట మీద నిలబడి నాకు ఆ సినిమా అవకాశం ఇచ్చారు.
ఇలా నేను క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుంటూ జుట్టు మొత్తం రాలిపోతున్నప్పటికీ ఆయన మాట తప్పలేదు నా స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకోవచ్చు కానీ నాగార్జున అలా చేయలేదు.ఇచ్చిన మాట పై నిలబడి నాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో నాకు నాగార్జున గారు ఒక దేవుడులా కనిపించారు అంటూ నాగార్జున గురించి మమతా మోహన్ దాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…