Tarakaratna Friend Suresh : కుప్పం పాదయాత్రకు వెళ్లి గుండెపోటు రావడంతో నారాయణ హృదయాలయ లో 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు శివరాత్రి రోజున మరణించారు. ఆయన మరణం ఆయన కుటుంబాన్నే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు ప్రజలను బాధకు గురిచేసింది. ఇక ఆయన ఈమధ్యనే మళ్ళీ పాలిటిక్స్ లో బిజీ అవుతూ ఈసారి ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అందుకోసం సిద్ధపడుతున్న సమయంలో ఇలా అంతలోకాలకు వెళ్లిపోయారు. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి గురించి వారి ఫ్యామిలీ గురించిన విషయాలను ఆయన స్నేహితుడు సురేష్ పంచుకున్నారు.
అలేఖ్య పేరెంట్స్ ఎవరంటే…
అలేఖ్య రెడ్డి కి రెండో వివాహం కావడం వల్ల అలాగే ఇతర కులం కావడం వల్ల తారకరత్న పేరెంట్స్ వాళ్ళ పెళ్లి ఒప్పుకోలేదు. అయితే ఇటు అలేఖ్య రెడ్డి పేరెంట్స్ కూడా వారి పెళ్ళికి నిరాకరించడం వల్ల అలేఖ్య, తారకరత్న ఇద్దరూ గుడిలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలేఖ్య రెడ్డి పేరెంట్స్ తారకరత్నతో పెళ్ళికి నిరాకరించడానికి కారణం నందమూరి కుటుంబం అటు పొలిటికల్ గాను ఇటు సినిమా రంగంలో ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి రాజకీయ కుటుంబానికి అలేఖ్య ను ఇచ్చి ఆ పెళ్లి వల్ల కూతురు బాగా బాధపడిందని మళ్ళీ అటువంటి సిట్యుయేషన్ వద్దు అని వాళ్ళు నిరాకరించారు.
ఇక అలేఖ్య రెడ్డి తల్లిదండ్రుల గురించి సురేష్ గారు మాట్లాడుతూ అలేఖ్య రెడ్డి నాన్న మధుసూదన్ రెడ్డి గారు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆర్టీ ఆఫీసర్ గా రిటైర్డ్ అయ్యారు. ఇక అలేఖ్య రెడ్డి పిన్ని భర్త విజయసాయిరెడ్డి గారు. ఆయనే తారకరత్న, అలేఖ్యరెడ్డి పెళ్ళికి మొదటి నుండి సపోర్ట్ చేసారు అంటూ చెప్పారు. ఇక అలేఖ్య రెడ్డి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిందని, తారకరత్న సినిమాలకు కూడా పనిచేసిందంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…