Rakesh -Sujatha: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఒకరు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా వీరిద్దరూ కలిసి ఒకే స్కిట్లో సందడి చేసేవారు. ఇలా ఒకే స్కిట్ లో సందడి చేస్తున్నటువంటి రాకేష్ సుజాత మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వీరు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఈ జంట గత కొంతకాలంగా ప్రేమ ప్రయాణంలో మునిగి తేలుతూ చివరికి పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు.రాకేష్ సుజాత జనవరి చివరి వారంలో ఎంతో ఘనంగా నిశ్చితార్ధాన్ని జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థానికి పెద్ద ఎత్తున జబర్దస్త్ కమెడియన్స్ బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే తాజాగా ఈ జంట తమ వివాహ వేడుకను జరుపుకున్నట్టు సమాచారం.
ఇలా ఈ జంట పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుజాత రాకింగ్ రాకేష్ పెళ్లి వేడుకలలో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు బుల్లితెర నటీనటులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి ఫోటోలలో భాగంగా గెటప్ శ్రీను దంపతులతో పాటు యాంకర్ రవి దంపతుల కుమార్తె కూడా వీరి పెళ్లికి హాజరైనట్టు తెలుస్తోంది.
ఇలా వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కావడంతో వీరు పెళ్లి ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక సుజాత రాకేష్ కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా నిర్వహిస్తూ వారికి సంబంధించిన విషయాలన్నింటిని వీడియోల రూపంలో తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…