Featured

ప్రేమించాడు.. శారీరకంగా దగ్గర అయ్యాడు.. పెళ్లి చేసుకోమంటే ఇలా చేశాడు..

ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతులు మోస పోతున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఇలాంటి కేసులు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకొని తిరిగి .. చివరకు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటేసే మోసగాళ్లు ఈ మధ్య ఎక్కువయ్యారు.

అలాంటి వారికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి విజయవాడలోని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ.. పెజ్జోనిపేటకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

మొదట్లో తన తోటి మహిళలతో స్నేహం చేసిన సదరు యువతి.. తర్వాత తన క్లాస్ కు చెందిన యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు తోటి విద్యార్థి సుహృద్‌. ప్రేమిస్తున్నట్లు వెంట పడ్డాడు. ఆమె మొదట నిరాకరించింది. పెళ్లి చేసకుంటానని నమ్మించాడు.

తర్వాత ఆమెను తీసుకొని బయట తిరగడం ప్రారంభించాడు. ఇలా పలుమార్లు ఆమెపై లైగికంగా దగ్గరయ్యాడు. తర్వాత ఓ రోజు సదరు యువతి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయగా అతడి నిజ స్వరూపం బయటపడింది. ఒత్తిడి ఎక్కువగా రావడంతో ఆమెకు దూరంగా ఉంటూ.. తప్పించుకొని తిరగడం ప్రారంభించాడు. దీంతో యువతి తనను మోసం చేశాడని తెలుసుకొని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

4 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

7 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

7 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

8 hours ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

9 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

10 hours ago