వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఆమెకు పిల్లలు లేరు. అంతే కాకుండా ఆమె ఇటీవల క్యాన్సర్ రావడంతో చనిపోయింది. దీంతో ఆమె భర్త ఒక్కడే ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇంటిని సర్దుతుండగా అతడికి అనుకోని దృశ్యం కంటపడింది. ఒక ప్రదేశంలో ఓ మృతదేహం కనిపించింది. వెంటనే భయపడిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రదేశం మొత్తం గాలిస్తుండగా అక్కడ మరో రెండు మృతదేహాలు దొరికాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాన్స్‌లోని మెజెరే లో 41 సంవత్సరాల వ్యక్తి నివసిస్తున్నాడు. అతడి భార్య ఈ మధ్య క్యాన్సర్ తో బాధపడుతూ చనిపోయింది. దీంతో ఇంటిని శుభ్రం చేసే క్రమంలో అతడికి ఓ మృతదేహం కంటపడింది. ఇంట్లో బాలుడి మృతదేహం గుర్తించిన అతడు ఆశ్చర్యపోయాడు.
వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. దీంతో పోలీసులు హుటాహుడిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బాలుడి శవాన్ని పరిశీలించి.. చుట్టు పక్కల ప్రదేశంలో కూడా ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెతకడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్న మరో బ్యాగులో రెండు శవాలు కనిపించాయి.
ఆ మూడు మృతదేహాలు పిల్లలవే కావడం విశేషం. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే అతడి భార్యకు ఇంతక ముందే పెళ్లి అవడం.. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటం.. ఇప్పుడు ఆమె రెండో వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు. ఏదేమైనా స్థానికంగా ఇది సంచలనం స్పష్టించింది. ఒకే ఇంట్లో మూడు శవాలు ఉండటం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…