Bigg Boss 8: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందడంతో ఎంతోమంది అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సెలబ్రిటీలుగా మారడానికి ఎన్నో వింత ప్రయత్నాలు సాహసాలు చేస్తుండటం మనం చూస్తున్నాము. ఇలా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవడం కోసం విచిత్రమైన వీడియోలు చేస్తూ పోస్ట్ చేయడంతో ఇలాంటి ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి.
ఇలా సోషల్ మీడియా ద్వారా బాగా పేరు ప్రఖ్యాతల సొంతం చేసుకున్న వారు ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సైతం ఇలా రైతు బిడ్డను అంటూ వీడియోలు చేసుకోవడమే కాకుండా తనకి ఎలాగైనా బిగ్ బాస్ కార్యక్రమంలో అవకాశం కల్పించండి అంటూ అభిమానులను వేడుకున్నారు.
ఈయనకు సీజన్ సెవెన్ కార్యక్రమంలో కామన్ మ్యాన్ క్యాటగిరి లో భాగంగా అవకాశం రావడమే కాకుండా ఎవరూ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ ఏకంగా కప్పు గెలవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈయన స్ఫూర్తితోనే ఎంతోమంది సోషల్ మీడియాలో తాము బిగ్ బాస్ లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం చేస్తున్న వింత ప్రయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
బిగ్ బాస్ ఛాన్స్..
ఆల్ ఇండియా అందగాడు రవి అనే పేజ్ నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తలపై ఏకంగా బిగ్ బాస్ సీజన్ 8 అని రాసుకుని వేగంగా పరిగెత్తుతూ తనకు బిగ్ బాస్ అవకాశం కల్పించండి అంటూ ఈ వీడియోని షేర్ చేయడంతో ఒకసారిగా ఇది వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరు బిగ్ బాస్ ఎంట్రీ పక్కా కన్ఫామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…