Manas: బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న మానస్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. బాల నటుడిగానే పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ అనంతరం బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే మానస్ బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఈ కార్యక్రమం పూర్తి కాగానే కార్తీకదీపం సీరియల్ లో నటించిన సందడి చేశారు. అనంతరం స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ పాత్రలో నటిస్తూ మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇకపోతే గత ఏడాది ఈయన శ్రీజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు అలాగే తన భార్య సీమంతపు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా పెళ్లి జరిగి ఏడాది కూడా తిరగకుండానే మానస్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు.
ఇక ఇప్పటివరకు మానస్ తన కుమారుడి ఫోటోలను కూడా ఎక్కడ షేర్ చేయలేదు అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈయన తన కొడుకు బారసాల నామకరణ మహోత్సవానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇలా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన మానస్ తన కుమారుడికి ధ్రువ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో మానస్ కుమారుడి ఫేసు క్లియర్ గా కనిపించకపోయినా బాబు చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…