Featured

Manchu family issue: రోడ్డున పడ్డ మంచు కుటుంబం… అన్నదమ్ముల మధ్య విబేధాలు… నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో…!

Machu Family Issue : మంచు మోహన్ బాబు గారు ఇటీవల తన జన్మదిన వేడుకల సందర్బంగా కొడుకుల గురించి గొప్పగా చెప్పారు, పాపం అంతలోనే కొడుకులుద్దరూ గొడవ పడుతున్న వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ వీడియో ఎవరో పెట్టింది కూడా కాదు. స్వయంగా మంచు మనోజ్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ద్వారా అప్లోడ్ చేసాడు. మొత్తానికి ఇంట్లో ఉన్న గొడవను కాస్త రచ్చకీడ్చేశాడు. అయితే వెంటనే మోహన్ బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారని తెలుస్తోంది. వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా మనోజ్ కు చెప్పాడట. వెంటనే మనోజ్ ఆ వీడియోను తన పేస్ బుక్ నుండి తొలగించాడు. ఏదేమైనా మరోసారి ట్రోలర్స్, మీమర్స్ కి చేతి నిండా పనిపెట్టారు మంచు బ్రదర్స్.

మంచు తూఫాన్ కి కారణాలు ఏమిటి…

ఫిల్మ్ నగర్ ఈనాడు సమ్మర్ లో మంచు తూఫాన్ చెలరేగింది. మంచు బ్రదర్స్ ఇద్దరూ గోడవ పడ్డారు. ఇప్పటి వరకు రూమర్ గా ఉన్నా అభిప్రాయాబేధాలు అనే కాన్సెప్ట్ ను నిజం చేసేసారు మంచు బ్రదర్స్. ఇటీవలే మంచు మనోజ్ రెండో పెళ్లి భూమా మౌనిక రెడ్డీతో జరిగింది. ఈ పెళ్లి విషయంలోనే మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లకు అభిప్రాయ బేధాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట మోహన్ బాబు కి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా చివరకు సర్దుకున్నారు. అయితే విష్ణు కి ఆయన భార్యకు మాత్రం ఈ పెళ్లి సూతరాము ఇష్టం లేదట.

అందుకే పెళ్ళికి కూడా చుట్టపుచూపుగా వచ్చారు. నిజానికి మనోజ్ పెళ్ళికి ముందు కుటుంబంతో కలిసి లేడు. విడిగా ఫిల్మ్ నగర్ లోనే ఉంటున్నాడు. అప్పటికే అన్నదమ్ముల మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. వీడియోలో అయితే విష్ణు సారధి అనే వ్యక్తిని కొట్టడం వెనుక నుండీ మనోజ్ వీడియో షూట్ చేస్తూ ఇలానే ప్రతి సారి నా మీదకు వీళ్ళు గొడవకు వస్తారు అంటూ అనడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒకటి రెండు సార్లు ఇలా గొడవ పడ్డారనే అర్థంలో మనోజ్ మాట్లాడాడు. ఆస్తి, ఆర్థిక గొడవలే అయితే మోహన్ బాబు పెదరాయుడు తీర్పు ఇవ్వాల్సిందే మరి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago