Categories: FeaturedMovie News

Senior Journalist Bhardwaja : ఆమె వల్లే అన్నదమ్ముల మధ్య గొడవ…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణ, సంస్కారం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అయితే తాజాగా ఆయన కొడుకుల మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియా ఇంట రచ్చ చేస్తూ మోహన్ బాబు గారి క్రమశిక్షణ, సంస్కారం ఎక్కడికి పోయాయి అని జనాలు మాట్లాడుకుంటున్నారు. తాజాగా మంచు మనోజ్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్ లోడ్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక మంచు మనోజ్, విష్ణు మధ్య గొడవ, ఆ మంచు తుఫాన్ కి కారణం ఏమిటి అన్న విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఆమె వల్లే అన్నదమ్ముల మధ్య గొడవ…

ఇటీవలే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం కూడా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు, ముఖ్యంగా మోహన్ బాబు గారు ఈ వివాహనికి సుముఖంగా లేరు అనే వార్తలు వినిపించాయి. అన్నీ తానై మంచు లక్ష్మి తమ్ముడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించారు. అయితే వివాహానికి మోహన్ బాబు వస్తాడా రాడా అనే సంశయంలో చివరికి పెళ్ళికి వచ్చాడు. ఆ సమయంలో మౌనిక రెడ్డి ఎమోషనల్ అవడం కూడా చూసాం. అయితే మంచు విష్ణు మాత్రం పెళ్ళికి అతిధి లాగా అలా వచ్చి పట్టుమని ఒక అరగంట అయినా లేకుండా వెళ్ళిపోయాడు. అప్పటికే వారి మధ్య విబేధాలు ఉన్నాయనే చర్చ జరిగింది.

అయితే తాజాగా మంచు మనోజ్ మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సారధి అనే వ్యక్తి ఇంట్లో ఉండగా అక్కడికి వెళ్లి విష్ణు గొడవ పడ్డాడు. సారధిని కొట్టాడు. ఈ ఇష్యూను మనోజ్ వీడియో తీసి తరచూ ఇలా వీళ్ళు వచ్చి గొడవ పడుతూనే ఉంటారు అంటూ మాట్లాడిన వీడియో ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి ప్రపంచానికి వాళ్ళ గొడవను చూపించాడు అంటూ భరద్వాజ గారు మాట్లాడారు. అయితే ఈ గొడవకు కారణం విష్ణు భార్య వెరోనిక రెడ్డికి గల అభ్యంతరాలు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. వెరోనిక కుటుంబానికి అలాగే భూమా మౌనిక కుటుంబానికి గతంలో ఉన్న రాజకీయ వైరుద్యాలు అలాగే ఫ్యాక్షన్ గొడవల కారణంగానే మనోజ్ పెళ్ళికి అడ్డుకున్నారని భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. అయితే మోహన్ బాబు గారు చొరవ చూపి మనోజ్ ను ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పడంతో మనోజ్ ఆ వీడియో తొలగించాడని ఇలాంటి గొడవలు ప్రతి ఇంట్లో ఉండేవే అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago