Manchu Lakshmi : మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు లక్ష్మి తన సినిమాలతో కంటే తన ఇంగ్లీష్ భాష, యాసతో బాగా ఫేమస్. ఇక సినిమాల్లో చేసిన పెద్దగా హిట్స్ లేవు. ఇక బుల్లి తెరపై లక్ష్మి టాక్ షో, మేము సైతం వంటి కార్యకమాలు నిర్వహించిన లక్ష్మి సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను తన ఫాలోయర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. తన ఫిట్ నెస్ స్టోరీస్, యోగసనాలు, తన కూతురు నిర్వాణ గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ ఉంటుంది.
గాయలతో మంచు లక్ష్మి…
నిరంతరం ఇంస్టాగ్రామ్ లో ఏదో ఒక పోస్ట్ పెట్టి లేదా లైవ్ నిర్వహిస్తు అభిమానులతో టచ్ లో వుండే లక్ష్మి మొహం మీద చేతికి గాయలతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే లక్ష్మి ఫాలోయర్స్ ఏమయిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక మళ్ళీ మంచు లక్ష్మి ఆ ఫోటో కి వివరణ ఇస్తూ వీడియో షేర్ చేసింది. విషయానికోస్తే మంచు లక్ష్మి కి ఏ ప్రమాదం జరగలేదు. ఆ గాయాలు తన నెక్స్ట్ సినిమా కోసం వేసుకున్న మేకప్.
మంచు లక్ష్మి అగ్ని నక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించి ఒక సన్నివేశం కోసం అలా గాయలతో ఉన్న ముఖం మేకప్ చేసారు. వివరాలు చెప్పకుండా ఆ ఫోటో పెట్టడంతో లక్ష్మి ఫాలోయర్స్ ఏమయిందని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక ఈ ఫోటోకి వివరణ ఇచ్చిన లక్ష్మి ఆ మేకప్ వీడియో ని షేర్ చేసి వివరాలను చెప్పకుండా ఫోటో షేర్ చేసి మిమల్ని భయపెట్టినందుకు సారీ అంటూ చెప్పి నామీద ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ లో రాసింది. ఇక మేకప్ ఇంత సహజంగా చేసిన అగ్ని నక్షత్రం సినిమా మేకప్ ఆర్టిస్తులకు కృతజ్ఞతలు తెలిపింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…