Akkineni Naga Chaithanya : అక్కినేని నట వారసుడుగా ‘జోష్’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. తరువాత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో విజయాన్ని, పేరును సంపాదించుకున్నాడు. అయితే ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి బంగార్రాజు సినిమా నుండి వరుస విజయాలు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా విడుదల అయిన ‘థాంక్యూ’ సినిమా మాత్రం నిరాశను మిగిల్చింది. అయితే నాగ చైతన్య గురించి ఒక వార్త ఆసక్తికరంగా వుంది. నాగ చైతన్య ఒక విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ లను మించిపోయాడు అంటున్నారు.
చిరంజీవి, రామ్ చరణ్ లను మించిపోయిన నాగ చైతన్య…
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ల క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఏ విషయంలో చిరంజీవి, రామ్ చరణ్ లను నాగ చైతన్య మించిపోయాడా అని అందరు అనుకుంటున్నారు. నాగ చైతన్య సినిమాలు, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఈ మెగా హీరోలని దాటే అవకాశంలేదు. కాకాపోతే ఓ విషయంలో మాత్రం మించిపోయాడు.
తాజాగా నాగచైతన్య నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ నష్టాల్ని చూసింది. హైద్రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో నాలుగో రోజు ఉదయం ఆట వసూళ్ళ కేవలం 12,440 రూపాయలు మాత్రమే రాబట్టగలిగింది. అయితే ‘ఆచార్య’ సినిమా ఇదే రోజు, ఇదే షోకి 12,309 రూపాయలతో సరిపెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ విషయంలో చూస్తే రామ్చరణ్, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కన్నా కూడా చైతూమూవీ కాస్త మించిపోయింది అని అభిమానులు సంతృప్తిచెందుతన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…