Manchu Lakshmi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థాన్నాన్ని సంపాదించుకున్నారు. మంచు మోహన్ బాబు వారసత్వంతో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రశంసలు అందుకుంది. వెండి తెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. అంతే కాకుండా లక్ష్మి మంచుకు ఒక యుట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో హోమ్ టూర్లు, వాళ్ళ ఇంట్లోని సెలెబ్రేషన్లు, దానికి సంబంధించిన వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు.
తెలుగుమ్మాయిలను మనవాళ్లు చూడరు…
మంచు లక్ష్మి మొదట హాలీవుడ్ లో పలు సిరీస్ లో నటించి ఇండియా వచ్చాక తెలుగు సినీమాలలో నటించారు. అయితే పెద్దగా అవకాశాలు అందుకోలేకపోవడంతో అటు బుల్లితెర మీద కూడా ప్రయత్నించారు. ఇక నిర్మాణ రంగంలోనూ ఉన్న లక్ష్మీ ఇటీవలే మలయాళం సినిమాలో లెస్బియన్ గా నటించి ఆశ్చర్య పరిచారు. ఇక టాలీవుడ్ గురించి మాట్లాడుతూ హాలీవుడ్ లో అవకాశాలను వెతుక్కోవడం చాలా ఈజీ, ఇక్కడ ఉన్న ఇన్నేళ్లు నేను హోలీవుడ్ లో ఉండి ఉంటే హాలీవుడ్ లో ఎక్కడో ఉండేదాన్ని.
కానీ ఇక్కడ మనవాళ్ళు బయట నుండి వచ్చిన అమ్మాయిలను చూస్తారు కానీ తెలుగుమ్మాయిలను చూడరు. నిహారిక, బిందు మాధవి, మాధవిలత, స్వాతి ఇలా ఏంతో టాలెంట్ ఉన్నవాళ్లు ఉన్నా వాళ్ళందరికీ అవకాశాలు ఇక్కడ రావు అంటూ చెప్పారు. ఇది మన ఆడియన్స్ కూడా ఆలోచించాలి. ఒక హీరో కూతురు అంటే తెర వెనుక ఉండాలి అదే హీరో కొడుకు అయితే హీరో గా రావాలి అనే ధోరణి మన దగ్గర ఎక్కువ ఉంది అంటూ చెప్పారు మంచు లక్ష్మి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…