Sitara:మహేష్ బాబు గారాల పట్టి సితార చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈమె ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో తనకంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేసే సితార ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇలా నిత్యం పలు పాటలకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇంత చిన్న వయసులోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె తాజాగా ఓ నగల సంస్థకు సంబంధించి యాడ్ లోనటించిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలు టైం స్క్వేర్ పై తలుక్కుమనడంతో ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానులు అలాగే మహేష్ బాబు దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విధంగా సితార ఈ ఫోటోలలో అచ్చం యువరాణి లాగే ఉన్నారు.ఇక ఈ ఫోటోలు చూసినటువంటి మహేష్ బాబు నమ్రత దంపతులు ఎంతో గర్వపడుతున్నారు. ఇంత చిన్న వయసులోనే తమ కూతురికి ఇలాంటి గౌరవం దక్కడం చూసి ఈ దంపతులు గర్వపడుతున్నారు. ఇకపోతే ఈ నగల సంస్థ కోసం సితార తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఈ యాడ్ చేయడం కోసం సితార ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇంత చిన్న వయసులోనే ఒక్క యాడ్ కోసం సెలబ్రిటీల స్థాయిలో సితార రెమ్యూనరేషన్ తీసుకున్నారని విషయం తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ వయసులోనే ఈ స్థాయిలో సంపాదిస్తుంటే ఫ్యూచర్లో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎంతో పేరు సంపాదించుకుంటుందని పలువురు భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…