సాధారణంగా ప్రస్తుతం ఏ చిన్న సీక్రెట్ దాచాలని అనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే పాకిపోతుంది.. వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రియ సరన్ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ఏడాది పాటు దాచేసింది.
కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయమే కానీ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఆమె ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది. శ్రీయ పోస్టుకు ఆమె రీ ట్వీట్ చేసింది. శ్రీయకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం.
అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలారోజుల తర్వాత మళ్లీ RRR మూవీలో నటిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…