శ్రీయ సరన్ ప్రెగ్నేన్సీపై.. మంచు లక్ష్మి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

0
1220

సాధారణంగా ప్రస్తుతం ఏ చిన్న సీక్రెట్ దాచాలని అనుకున్నా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే పాకిపోతుంది.. వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రియ సరన్ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ఏడాది పాటు దాచేసింది.

కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. ఒక ఆడపిల్లకు జన్మనివ్వడం సంతోషకరమైన విషయమే కానీ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటే బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్‌ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆమె ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న స్పందించింది. శ్రీయ పోస్టుకు ఆమె రీ ట్వీట్ చేసింది. శ్రీయకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘‘ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పడంలో నువ్వు తీసుకున్న సమయం విషయమై నిన్ను చూసి గర్వపడుతున్నా. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం.

అది అందరికీ సమయానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని తెలిపింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని శ్రీయ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలారోజుల తర్వాత మళ్లీ RRR మూవీలో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here