కలెక్షన్ కింగ్ మంచు మోహన్ వాబు.. నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి.
ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో చేస్తున్నట్లు.. అవి కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాటయట. తాజాగా ఆమె తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు పోస్టు చేశారు. అందులో ఆమె గాయపడ్డట్లు కనిపించింది. ఆమె చేతి వేళ్ల నుంచి రక్తం కారుతోంది. చేతి వేళ్లకు బలంగా దెబ్బతగిలిట్లు కనిపిస్తోంది. ఇక ఆమె జీన్స్ మొత్తం చినిగిపోయింది. గాయం కారణంగా ఆమె జీన్స్ చినిగిపోయి కనిపించింది.
మోకాలి వద్ద ఆమెకు తీవ్రగాయం అయింది. వీటికి సంబంధించి ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టు చేశారు. దీంతో ఆమె అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఏమైంది అంటూ.. కామెట్ల రూపంలో ఆమెను అడిగారు. అయితే ఆమెకు నిజంగా గాయాలు కాలేదట.. రియల్ యాక్సిడెంట్ కాదట. రీల్ యాక్సిటెంట్ మాత్రమే. ఆమె తన షూటింగ్ లో భాగంగా ఆమె మేకప్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మళయాలంలో మోహన్ లాల్ సినిమాలో నటిస్తున్నారు.
ఆమె ఫైట్ సీన్ లో ఇలా మేకప్ వేసుకోవాల్సి వచ్చిందనే ఆమె వివరణ ఇచ్చారు. మొదట ఆ ఫొటోలు పోస్టు చేసి.. తర్వాత ఆందోళన చెందుతున్నారని.. మళ్లీ మరో పోస్టు షేర్ చేశారు. ఓకే… ఓకే… నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోనివి. రియల్ యాక్సిడెంట్ కాదు. నా గురించి ఇంత ఆలోచిస్తున్నారని తెలిసి ఎంతో ఆనందంగా ఉందన్నారు. లవ్ యు ఆల్ అని లక్ష్మీ మంచు పేర్కొన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…