బిగ్బాస్ తెలుగు సీజన్ 5 ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 19 మంది ఎన్నో ఆశలతో బిగ్బాస్ లోకి అడుగుపెట్టగా.. చివరకు 5గురు మిగిలారు. దీనిలో నుంచి ఇప్పటికే సిరి, మానస్ బయటకు వచ్చారనే సమాచారం తెలుస్తోంది. ఇక మిగిలిన ముగ్గురు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు నడవనుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా షణ్ముఖ్ టైటిల్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకున్నాడు. నాలుగు వారాల తర్వాత .. సమీకరణాలు అన్నీ తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా సన్నీ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఎవరి అంచనాలకు అందకుండా.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది కూడా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది.
ఇక హౌస్ లో ఉన్న శ్రీరామచంద్ర విషయానికి వస్తే.. తెలుగులో తన పాపులారిటీని పెంచుకోవాడానికి హౌస్ లోకి అడుగుపెట్టారు. అతడు అనుకున్నట్లుగానే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. విన్నర్ గా సన్నీని అనౌన్స్ చేయగా.. రన్నర్ గా శ్రీరామచంద్ర ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు రూ.50 లక్షల ప్రూజ్ మనీ తో పాటు ఒక బైక్ ను మరియు రూ.25 లక్షలు విలువచేసే ఓ ప్లాట్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఫైనల్ లో మిగిలిన వీళ్ల ముగ్గరికి మనీ ఆఫర్ చేస్తాడనేది కూడా వార్తలు వస్తున్నాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…