Manchu Lakshmi: మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి వరుస సినిమాలు టాక్ షోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తాజాగా సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చివరిగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ పలు సినిమాలకు కమిట్ అయిన ఇంకా షూటింగ్ పనులను ప్రారంభించుకోలేదు అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాకి దర్శకత్వం వహించినందుకుగాను ఉత్తమ దర్శకుడుగా న్యూయార్క్ ఫిలిం సర్కిల్స్ నుంచి రాజమౌళి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ బెస్ట్ యాక్టర్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చోటు సంపాదించుకున్నారు.
ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రముఖులతో పోటీపడి ఎన్టీఆర్ పోటీపడి టాప్ టెన్ పొజిషన్లో ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. మరి ఇలాంటి ఘనత సాధించిన ఎన్టీఆర్ ను సెలబ్రిటీలు మీడియా ఏమాత్రం పట్టించుకోలేదని మంచు లక్ష్మి మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఈ విషయం గురించి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ చిన్నపాటి అసహనం వ్యక్తం చేశారు. ఎందుకు మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్ సాధించిన ఘనత చిన్న విషయమేమీ కాదు. తారక్ సాధించిన ఈ ఘనతకు మీ నుంచి విజిల్స్, చప్పట్లు రావాలి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…