Siva Krishna : ఇప్పటి తరంవారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలిసిన శివ కృష్ణ మొదట హీరోగా పరిచయమై మూడు వరుస హిట్లు కొట్టారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ‘మరో మలుపు’ సినిమాతో మొదటి హిట్ హీరోగా అందుకున్న శివ కృష్ణ ఇంట్లో వాళ్ళకి ఆయన సినిమాల్లో నటించడం ఇష్టం లేదు. ఆ సినిమా తరువాత 16 సినిమా అవకాశలు వచ్చినా ఆయన నచ్చినవి మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నారు.
అలా ఎన్టీఆర్ గారి పక్కన కూర్చోరాదని నాకు తెలియదు….
మరో మలుపు చిత్రం ద్వారా మలుపు తిరిగిన కెరీర్ తో ‘మరోసారి ఈ చరిత్ర’ సినిమా తీశారు. ఆ సినిమా కూడా చెప్పుకొదగ్గ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ‘ఇది కాదు ముగింపు’ సినిమాతో మళ్ళీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలన్నీ కూడా కమ్యూనిజం భావాలు కలిగిన సినిమాలే. వీటి తరువాత ఆయన కమర్షియల్ సినిమాల వైపు నడిచారు. ఊరేగింపు, పదండి ముందుకు, దండయాత్ర, ముందడుగు వంటి సినిమాల్లో నటించారు. స్వతహాగా ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శివ కృష్ణ గారు ఎన్టీఆర్ గారి నా దేశం సినిమాలో నటించారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ గారితో మొదట నటించినపుడు, పిలిచి మాట్లాడాలని అన్నపుడు పక్కన వెళ్లి కూర్చోగా, అయితే అలా కూర్చోవద్దని మిగతా ఆర్టిస్టులు సైగ చేసారు. నాకు అర్థం కాలేదు కానీ ఎన్టీఆర్ గారు నాతో చాలా బాగా మాట్లాడారు. ఇంత లేట్ గా ఇండస్ట్రీ కి ఎందుకు వచ్చావ్ అని అడిగారట, ఇక 1స్ట్ టేక్ లోనే షాట్ ఓకే అవ్వడంతో చాలా బాగా అనిపించిందని శివకృష్ణ అప్పటి అనుభవాలను పంచుకున్నారు. నిజానికి శివ కృష్ణ గారిది వ్యాపార కుటుంబం. అయినా ఎన్టీఆర్ గారంటే ఉన్న విపరీతమైన అభిమానంతో సినిమాల్లోకి వచ్చారట. శివ కృష్ణ గారు గాయం, చెన్నకేశవ రెడ్డి, అల్లరి రాముడు, ఈశ్వర్ వంటి అనేక చిత్రాల్లో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…