Honey Rose: బాలకృష్ణ గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ వేదికపై బాలయ్య ఒక నటితో కలిసి మలయాళంలో మాట్లాడటంతో ఆమె ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇలా బాలకృష్ణతో మలయాళంలో మాట్లాడి సందడి చేసిన నటి హనీ రోజ్ ఈమె వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు అనే పాటలో బాలకృష్ణతో కలిసి సందడి.
ఈ సినిమాలో హాని రోజ్ కీలక పాత్రలో కూడా నటించినట్టు సమాచారం. హనీ కేరళలో పుట్టి పెరిగింది. ఈమె 14 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో పలు అడపాదడపా పాత్రలలో నటించిన హనీ రోజ్ 2012లో రిలీజైన ‘త్రివేంద్రం లాడ్జ్’ అనే సినిమాతో హానీ రోజ్ కు బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇక తెలుగులో ఈమె వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనుకుంటే పొరపాటే.
ఈమె వీర సింహారెడ్డి సినిమా కన్నా ముందుగా.. ఆలయం, ఈ వర్షంసాక్షిగానే సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఇప్పుడు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఈమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో హనీ రోజ్ కీలకపాత్రలో నటించారు మరి ఈ సినిమా తనకు ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…