Manchu Lakshmi: మంచు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఇక్కడ సక్సెస్ కావడం కోసం కృషి చేస్తున్నారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె సరైన స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నారు. ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.
ముఖ్యంగా మనోజ్ మౌనిక పెళ్లి విషయంలో ఈమె తీసుకున్నటువంటి బాధ్యతల గురించి తెలియజేశారు మనోజ్ మౌనికల వివాహం చేయడానికి చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. ఇద్దరి కుటుంబాలకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న సందేహం నాన్నకి ఉండేది.
ఇక నాన్నను పెళ్ళికి ఒప్పించడం నావల్ల కాలేదు అందుకే ఓసారి యాదాద్రి వెళ్లినప్పుడు ఎలాగైనా వీరి పెళ్లికి నాన్నను ఒప్పించు దేవుడా అంటూ భారం మొత్తం తనపై వేశానని తెలిపారు మొత్తానికి మనోజ్ మౌనిక వివాహం జరిగిపోయిందని అందుకే వారిద్దరిని యాదాద్రి తీసుకెళ్లానని తెలిపారు.ఇక పెళ్లికి ముందు మనోజ్ మౌనిక ఇద్దరు మా ఇంట్లోనే ఉండేవారని ఇప్పుడు వేరుగా ఉంటున్నారని లక్ష్మీ ప్రసన్న తెలిపారు.
ఇక మనోజ్ నాకు ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే చేసి పెడతారని తనకు చాలా సాయంగా ఉంటారని తెలియజేశారు.ఇక తన కూతురి గురించి మాట్లాడుతూ తాను నలుగురు పిల్లలని కనాలని అనుకున్నాను కాకపోతే దేవుడు నాకు ఒకరిని ఇచ్చారు అంటూ తెలియచేశారు. ఇక రాజకీయాల గురించి ప్రశ్నలు రావడంతో అసలు తనకు రాజకీయాలు అంటేనే ఆసక్తి లేదని ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…