Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కుటుంబం నుంచి విష్ణు మనోజ్ లక్ష్మీప్రసన్న వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా నుంచి ఈమె ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె మలయాళంలో మోహన్ లాల్ నటించిన మాన్‌స్టర్ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో మంచు లక్ష్మి ఇది వరకు ఎప్పుడు నటించని పాత్రలో నటించి సందడి చేశారు. ఈ సినిమాలో మంచు లక్ష్మి పాత్ర తన నటనలో మరో స్థాయికి తీసుకువెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాలో మంచు లక్ష్మి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ తన నటనకు తన పాత్రకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
2011లో హరియాణాలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు.ఇలా ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడంతో అక్కడ ప్రజలు వారి పట్ల వ్యవహరించిన తీరు ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఇందులో మంచు లక్ష్మీ దుర్గ అనే పాత్రలో నటించగా, భామిని పాత్రలో హనీ రోజ్ నటించారు.
ఇందులో మంచు లక్ష్మి హోమో సెక్సువల్స్ పాత్రలో నటించడమే కాకుండా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించారు. ఇలా లెస్బియన్ పాత్రలో నటించాలంటే చాలా డేర్ ఉండాలి కానీ మంచు లక్ష్మి ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేశారు.ఇలాంటి పాత్రలో నటించడమే కాకుండా నటుడు మోహన్ లాల్ తో కూడా ఎంతో అద్భుతమైన ఫైట్ సన్నివేశాలలో నటించి మరోసారి తన విల నిజాన్ని చూపించారు. మొత్తానికి మంచు లక్ష్మి మలయాళంలో నటించిన ఈ సినిమా తనకు నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చిందని చెప్పాలి.
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…