Manchu Manoj : మంచు మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన వారసులుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు సినిమాల్లో పెద్దగా రానించలేదు. మనోజ్ డిఫరెంట్ జోనర్ సినిమాలను ప్రయతయించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ మంచు కుటుంబానికి ఉంది. అన్ని పేరు మోసిన పార్టీలతోను సత్సంబంధాలు ఉన్నాయి. విష్ణు భార్య వెరోనిక ఏపీ సీఎం జగన్ కి బందువు. ఇక ఇపుడు మనోజ్ కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
భూమా కుటుంబానికి అల్లుడు కాబోతున్న మంచు మనోజ్…
మంచు మనోజ్ విష్ణు భార్య వెరోనిక స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా 2019లో వ్యక్తిగత కారణాలతో ఇద్దరూ విడిపోయారు. ఇక భార్యతో విడాకులు తీసుకున్నాక మనోజ్ సినిమాల మీద కూడా పెద్దగా ఫోకస్ చేయలేక పోయాడు. సినిమాలకి బ్రేక్ ఇచ్చి పెద్దగా మీడియాలో కనిపించడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో మనోజ్ మళ్ళీ రెండో పెల్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు బాగా వినిపించాయి. మనోజ్ పెళ్లి ఈ అమ్మాయితోనే అంటూ చాలా మంది హీరోయిన్ల పేర్లతో పాటు బయట అమ్మాయిల పేర్లు వినిపించినా అవన్నీ పుకార్లుగా మిగిలాయి.
ఇక సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తూ మనోజ్ వీటిపై స్పందిస్తూ నాకు తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారు అంటూ సరదాగా కామెంట్ కూడా చేసాడు. అయితే ఇపుడు మాత్రం భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల కూతురు భూమా మౌనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా వీళ్లిద్దరూ సీతాఫల్ మండి లో గణేషుడి దర్శనానికి జంటగా వచ్చి మీడియా కంట పడ్డారు. దీంతో వీళ్ళిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…